
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కలిసి సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలై మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. పూణేలో జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. శంకర్ సినిమాలో పాటలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఆ తరహాలోనే ఈ సాంగ్ ను చిత్రీకరిస్తున్నాడు శంకర్.
అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈ చిత్రం రూపొందుతోంది. తాజా సమాచారం ప్రకారం జీ స్టూడియోస్ కూడా ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామి అవుతోంది. రీసెంట్ గానే దిల్ రాజుతో జీ స్టూడియోస్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఇన్వెస్ట్ చేయడంతో పాటు డిజిటల్, సాటిలైట్ రైట్స్ హక్కులను జీ సంస్థ తీసుకుంటుంది.
సునీల్, జయరాం, అంజలి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా షెడ్యూల్ తర్వాత చిత్రానికి లాంగ్ బ్రేక్ ఉంటుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
మరోసారి రామ్ చరణ్ రెండు పడవల ప్రయాణం
#RC15: రామ్ చరణ్ – కియారాల మధ్య భారీ బడ్జెట్ డ్యూయట్
రామ్ చరణ్ – శంకర్ చిత్రానికి ఐ విలన్?
సరికొత్త కాన్సెప్ట్ తో రామ్ చరణ్ సాంగ్ ను చిత్రీకరిస్తోన్న శంకర్