Homeగాసిప్స్చరణ్ ను వెయిటింగ్ మోడ్ లో పెడుతోన్న శంకర్

చరణ్ ను వెయిటింగ్ మోడ్ లో పెడుతోన్న శంకర్

చరణ్ ను వెయిటింగ్ మోడ్ లో పెడుతోన్న శంకర్
చరణ్ ను వెయిటింగ్ మోడ్ లో పెడుతోన్న శంకర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అగ్ర దర్శకుడు శంకర్ చేస్తోన్న ప్యాన్ ఇండియన్ చిత్రం ప్రకటించిన రోజు నుండే భారీ బజ్ ను సంపాదించుకుంది. రీసెంట్ గా షూటింగ్ ను కూడా మొదలుపెట్టిన ఈ చిత్రం పూణేలో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఆ షెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. అలాగే కొని రోజుల క్రితం హైదరాబాద్ లో సాంగ్ షూట్ మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి లావిష్ సాంగ్ ను చరణ్, కియారాల మధ్య చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి 2022 దసరాకు చిత్రాన్ని విడుదల చేయాలని రామ్ చరణ్ ప్లాన్ చేసుకున్నాడు.

అయితే ఇప్పుడు శంకర్ కారణంగా ఆ ప్లాన్స్ లో మార్పులు వస్తున్నాయి. శంకర్ దర్శకత్వం వహిస్తూ నిలిచిపోయిన ఇండియన్ 2 కు సంబంధించిన అడ్డంకులు అన్నీ కూడా క్లియర్ అయ్యాయి. డిసెంబర్ నుండి ఈ చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. 2022 సమ్మర్ కు చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

అంటే డిసెంబర్ నుండి కొన్ని నెలల పాటు చరణ్ ఖాళీగా ఉండిపోనున్నాడు. పోనీ ఈలోగా గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ మొదలుపెడదామా అంటే ఇంకా ఆ స్క్రిప్ట్ కొలిక్కి రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

#RC15: రామ్ చరణ్ – కియారాల మధ్య భారీ బడ్జెట్ డ్యూయట్

RRR నాటు నాటు ఫుల్ సాంగ్.. నటరాజుల నాటు డ్యాన్స్.. తారక్, చరణ్ ఈ ఒక్క పాట చాలు..!

రామ్ చరణ్ – శంకర్ చిత్రానికి ఐ విలన్?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All