Homeగాసిప్స్‘సలార్’ని ప్రభాస్ లైట్ తీసుకున్నాడా..?

‘సలార్’ని ప్రభాస్ లైట్ తీసుకున్నాడా..?

Did Prabhas Not Took Salaar Movie For Serious

రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ ఎలక్ట్రిఫయింగ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘సలార్’ ప్రపంచవ్యాప్తంగా మరికొద్ది గంటల్లో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పట్ల అభిమానులు మాత్రం కొంత నిరాశకు లోనయ్యారు. సలార్ మూవీ నుండి ఇప్పటివరకు కేవలం టీజర్, ట్రైలర్, రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ అంటూ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో చిత్ర యూనిట్ ఓ ఇంటర్వ్యూ చేసింది.

- Advertisement -

ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే, ఇందులో ప్రభాస్ కంటే కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా యాక్టివ్‌గా కనిపించాడు. ఇతర భాషల్లోనూ పృథ్వీరాజ్ మాత్రమే చాలా యాక్టివ్‌గా కనిపించాడు. దీంతో ప్రభాస్ సలార్ చిత్రాన్ని ఎందుకంతగా ప్రమోట్ చేయడం లేదనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాను ఆయన లైట్‌గా తీసుకున్నారా అనే సందేహం వారిలో నెలకొంది. అయితే, ప్రభాస్ దీనికి ఎలాంటి సమాధానం ఇస్తాడనేది చూడాలి. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర విధ్వంసకరంగా ఉండనుందని ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ చూస్తే తెలుస్తోంది.

అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All