Homeగాసిప్స్సలార్‌లో ఎన్టీఆర్.. రికార్డులకు పాతరేనా..?

సలార్‌లో ఎన్టీఆర్.. రికార్డులకు పాతరేనా..?

NTR Surprise In Prabha Salaar Movie

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా, ఈ సినిమాతో ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేయబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.

- Advertisement -

ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ చాలా సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో కేజీయఫ్ చిత్రాల హీరో యశ్ ఓ కేమియో రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పుడు సలార్ చిత్రాన్ని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు మరో స్టార్ హీరో కూడా రానున్నాడట. ఈ మూవీ క్లైమాక్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్తాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ముగింపులో ఎన్టీఆర్ వాయిస్ నుంచి ఓ అద్భుతమైన సీక్వెన్స్ మనకు వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, సలార్ రెండో భాగానికి సంబంధించిన ఇంట్రోను కూడా తారక్ నుంచే రాబోతుంది. అంతేగాక, రెండో భాగంలో తారక్ కూడా ఈ సినిమాలో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను పాతర వేయడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. దీనికి బలమైన కారణం కూడా ఉందని వారు చెబుతున్నారు. ఎన్టీఆర్ తన కెరీర్‌లోని 31వ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా సలార్‌తో రిలేట్ అయి ఉండనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే, రేపు సలార్ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All