Homeగాసిప్స్రాజమౌళి సెంటిమెంట్ కు ఆచార్య బలి..?

రాజమౌళి సెంటిమెంట్ కు ఆచార్య బలి..?

rajamouli sentiment work out in acharya
rajamouli sentiment work out in acharya

చిత్రసీమ సెంటిమెంట్ ను బాగా నమ్ముతుంది. ముఖ్యంగా రాజమౌళి సినిమా చేసిన హీరో నుండి మరో సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా ప్లాపే. ఇది ఈరోజుది కాదు స్టూడెంట్ నెం 1 నుండి వస్తున్న సెంటిమెంటే. ఎన్టీఆర్ , నితిన్ , ప్రభాస్ , రామ్ చరణ్ ఇలా అంత రాజమౌళి సినిమా తో ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో..ఆ తర్వాత సినిమా తో అంత విమర్శలు తెచ్చుకున్నవారే. బాహుబలి , బాహుబలి 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్..ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ లతో భారీ ప్లాప్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే జాబితాలో చేరినట్లే అర్ధమవుతుంది.

రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న చరణ్..ఈరోజు ఆచార్య తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మొదటి ఆటతోనే మిశ్రమ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ కి అంతటా కూడా ప్లాప్ టాకే నడుస్తుంది. కొరటాల శివ కెరీర్ లో ఇది చాలా బలహీనమైన కథ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. చిరు – చరణ్ కలిసి నటించినా.. సినిమాలో భావోద్వేగాలు పండకపోవడంపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మెగా తండ్రీకొడుకుల వరకు గొప్పగానే చెబుతున్నా.. బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -

దీనిని బట్టి ‘ఆచార్య’ సినిమా మరోసారి జక్కన్న సెంటిమెంటును నిజం చేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి మెగా ఫ్యాన్స్ ముందు దీని గురించి భయపడ్డారు. కానీ మెగాస్టార్ మాత్రం ఈ సెంటిమెంటును బ్రేక్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి సెంటిమెంటు గురించి మాట్లాడిన చిరంజీవి.. ‘ఆచార్య’ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు.. బ్యాడ్ సెంటిమెంట్ ను అధిగమిస్తుందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పబ్లిక్ టాక్ మరి రివ్యూలు చూస్తుంటే ఫలితం మరోలా ఉందనిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All