Homeగాసిప్స్పుష్ప 2 లో సునీల్​ శెట్టి..

పుష్ప 2 లో సునీల్​ శెట్టి..

sunil shetty in pushpa 2
sunil shetty in pushpa 2

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్​’ మూవీ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా సత్తాను చాటింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్‌’ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతుంది. జులై నెలలో ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. కాగా పార్ట్ 1 ను మించేలా తీయాలని సుకుమార్​ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే కథలో కొన్ని మార్పులు కూడా చేశారని తెలుస్తుంది.

తాజాగా ఈ మూవీ గురించి మరో కొత్త ఇంట్రెస్టింగ్​ అప్డేట్​ వినిపిస్తోంది. ‘పుష్ప 2’లో భన్వర్​ సింగ్​(ఫహద్​ ఫాజిల్) పాత్రతో పాటు​ మరో సీనియర్​ పోలీస్​ ఆఫీసర్​ క్యారెక్టర్​ కూడా ఉండబోతుందట. ఆ పాత్రలో బాలీవుడ్​ సీనియర్ హీరో సునీల్​ శెట్టి నటించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా , దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All