Homeగాసిప్స్దేవర.. అంటూ తలపట్టుకుంటున్న కొరటాల!

దేవర.. అంటూ తలపట్టుకుంటున్న కొరటాల!

Koratala Siva Faces Trouble With Fans Of Devara

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో రానున్న ‘దేవర’ కూడా ఒకటి. ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఇందులో తారక్‌ను నెవర్ బిఫోర్ పాత్రలో కొరటాల ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా నుండి నెక్ట్స్ అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమనులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

అయితే, ఇప్పుడు ఇదే కొరటాల శివకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దేవర చిత్ర టీమ్ ప్రస్తుతం నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటూ బిజీగా ఉంది. అయితే, అభిమానులు ఈ సినిమా నుండి తదుపరి అప్‌డేట్ ఎప్పుడిస్తారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దేవర టీమ్ వెంటనే చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్ ఇవ్వాల్సిందిగా వారు కోరుతున్నారు. దీంతో #WeWantDevaraUpdate అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా, త్వరలోనే దేవర సినిమా నుండి ఓ అప్డేట్ వస్తుందని ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా ఫ్యాన్స్ ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుండటంతో కొరటాల ఫీల్ అవుతున్నారట.

ఇక ఈ సినిమాలో తారక్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాడట కొరటల. అటు, ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తోన్న అందాల భామ జాన్వీ కపూర్ పాత్ర కూడా అల్టిమేట్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండనుండగా, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడట. మరి ఈ సినిమా నుండి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All