RRR సినిమా నుండి సెకండ్ సాంగ్ నాటు నాటు సాంగ్ రిలీజైంది. ప్రోమోతోనే సూపర్ అనిపించిన ఈ సినిమాలోని ఈ ఫుల్ సాంగ్ భీభత్సం అనిపించేసింది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు అన్నట్టుగా ఉంది. ఆర్.ఆర్.ఆర్ సాంగ్స్ తోనే ఈ విధంగా ఆడియెన్స్ లో అంచనాలు పెంచేస్తున్న జక్కన్న ఖచ్చితంగా సినిమాతో రికార్డులు బద్ధలయ్యేలా చేస్తాడని చెప్పొచ్చు.
ఆల్రెడీ దొస్తీ సాంగ్ లో తారక్, చరణ్ ఇద్దరు అలా కలిసి వస్తేనే అబ్బో అదుర్స్ అనుకున్న ఫ్యాన్స్.. ఈ పాటలో ఇద్దరు కలిసి జోడీ కట్టి డ్యాన్స్ చేస్తే అబ్బా అర్జెంట్ గా బొమ్మని వెండితెర మీద చూసేయాలి అనేలా ఎగ్జైటింగ్ గా ఉంది. కీరవాణి మ్యూజిక్.. చంద్రబోస్ లిరిక్స్.. నాటు బాంబుల్లాంటి ఇద్దరి హీరోల డ్యాన్స్ ఇక ఆర్.ఆర్.ఆర్ రికార్డులకు అందరం సాక్ష్యులం అవ్వాలని ఎదురుచూసేద్దాం.
