
శంకర్ సినిమాలలో పాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. తన ప్రతీ సినిమలోని ప్రతీ పాటలో శంకర్ ఏదో కొత్తదనం, భారీతనం ఉంచుతాడు. పాటలపై భారీ స్థాయిలో ఖర్చు పెట్టించే శంకర్ వాటికి అంతే గుర్తింపును కూడా తీసుకొస్తాడు. ప్రస్తుతం శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ స్థాయిలో ప్యాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే పూణేలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేశారు కూడా.
ఇక సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఈ షెడ్యూల్ లో పాల్గొనడానికి కియారా అద్వానీ హైదరాబాద్ చేరుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సాంగ్ ను చిత్రీకరిస్తారు. ఈ సాంగ్ కోసం అక్కడ భారీ సెట్ ను కూడా నిర్మించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడైన ఎస్ ఎస్ థమన్ ఇప్పటికే అదిరిపోయే డ్యూయట్ ట్యూన్ ను ఇచ్చినట్లు సమాచారం. రెండు, మూడు రోజులుగా రామ్ చరణ్ – కియారాలు డ్యాన్స్ రిహార్సల్స్ లో కూడా పాల్గొంటున్నారు.
విజువల్ గా కళ్ళు చెదిరే రీతిలో ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని ఊహకందని రేంజ్ లో ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నాడు. తన 50వ చిత్రం కావడంతో అంతే స్పెషల్ గా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
రామ్ చరణ్ సినిమా పూజ కార్యక్రమానికి భారీగా ఖర్చు చేసిన దిల్ రాజు
రామ్ చరణ్ – శంకర్ చిత్రానికి బాలీవుడ్ బ్యూటీ కన్ఫర్మ్
వినయ విధేయ రామ 8 డేస్ కలెక్షన్స్