Homeన్యూస్రామ్ చరణ్ - శంకర్ చిత్రానికి ఐ విలన్?

రామ్ చరణ్ – శంకర్ చిత్రానికి ఐ విలన్?

రామ్ చరణ్ - శంకర్ చిత్రానికి ఐ విలన్?
రామ్ చరణ్ – శంకర్ చిత్రానికి ఐ విలన్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన నెక్స్ట్ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్న ప్యాన్ ఇండియన్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. పూణేలో చిత్రీకరణ మొదలై ఒక యాక్షన్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అలాగే పూణేలోనే భారీ సెట్టింగ్స్ మధ్య రామ్ చరణ్ – కియారా అద్వానీలపై ఒక సాంగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడట. దాదాపు 12 రోజుల పాటు ఈ సాంగ్ ను తనదైన స్టైల్ లో శంకర్ చిత్రీకరిస్తాడని తెలుస్తోంది. ఈ ఒక్క సాంగ్ కోసమే భారీ బడ్జెట్ ను కేటాయించాడట నిర్మాత దిల్ రాజు.

ఇక ఈ చిత్రంలో విలన్ గా మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తాడని ప్రచారం జరిగింది కానీ తాజా సమాచారం ప్రకారం మలయాళ ప్రముఖ్ నటుడు సురేష్ గోపి ఇందులో విలన్ గా చేయనున్నాడట. శంకర్ తెరకెక్కించిన ఐ చిత్రంలో కూడా సురేష్ గోపి విలన్ గా చేసాడు.

- Advertisement -

ఇప్పటికే సురేష్ గోపి డీల్ పై సైన్ చేసి డేట్స్ కూడా కేటయించినట్లు తెలుస్తోంది. జయరాం, సునీల్, అంజలి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ భామ ఈషా గుప్తా కూడా నటిస్తుందని సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All