Homeగాసిప్స్మరోసారి రామ్ చరణ్ రెండు పడవల ప్రయాణం

మరోసారి రామ్ చరణ్ రెండు పడవల ప్రయాణం

మరోసారి రామ్ చరణ్ రెండు పడవల ప్రయాణం
మరోసారి రామ్ చరణ్ రెండు పడవల ప్రయాణం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తన కెరీర్ మొదట్లో చేసిన బాలీవుడ్ ప్రయత్నం బెడిసికొట్టిన విషయం తెల్సిందే. మరోసారి బాలీవుడ్ కు వెళ్తున్నాడు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ తెలుగు, హిందీతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఆచార్య చిత్రంలో కూడా నటించాడు చరణ్.

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్యలో చరణ్ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే మరోసారి రామ్ చరణ్ రెండు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొననున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో సాగుతోంది. స్పెషల్ సెట్ లో చరణ్, కియారాల మధ్య లావిష్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ నెలాఖరు వరకూ జరుగుతుంది.

- Advertisement -

ఈ షెడ్యూల్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ కు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నారు. ఆచార్య, ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో చరణ్ పాల్గొంటాడు. జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతోంది. ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కానుంది. మరోవైపు శంకర్ కూడా డిసెంబర్ నుండి ఇండియన్ 2 షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తాడని తెలుస్తోంది. మళ్ళీ మార్చ్ లో శంకర్ – రామ్ చరణ్ సినిమా షూటింగ్ ఉంటుందిట. ఈలోపు చరణ్, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ను కూడా మొదలుపెడతాడు.

ఇవి కూడా చదవండి:

యూవీ క్రియేషన్స్ లో సినిమాను అనౌన్స్ చేసిన రామ్ చరణ్

‘మా’ ఎలక్షన్స్.. క్లైమాక్స్ కి వచ్చిన కథ..!

RRR రిలీజ్ డేట్ ఫిక్స్.. జనవరి 7న గ్రాండ్ రిలీజ్..!

అనుభవించు రాజా: పల్లెటూరి ఎంటర్టైన్మెంట్ గట్టిగా ప్లాన్ చేసారు!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All