Homeన్యూస్సరికొత్త కాన్సెప్ట్ తో రామ్ చరణ్ సాంగ్ ను చిత్రీకరిస్తోన్న శంకర్

సరికొత్త కాన్సెప్ట్ తో రామ్ చరణ్ సాంగ్ ను చిత్రీకరిస్తోన్న శంకర్

సరికొత్త కాన్సెప్ట్ తో రామ్ చరణ్ సాంగ్ ను చిత్రీకరిస్తోన్న శంకర్
సరికొత్త కాన్సెప్ట్ తో రామ్ చరణ్ సాంగ్ ను చిత్రీకరిస్తోన్న శంకర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని వీలు కోసం #RC15గా సంభోదిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ చిత్ర షూటింగ్ పూణేలో ప్రారంభమైంది. సాంగ్ షూట్ తో చిత్రీకరణను ప్రారంభించారు. రెండు వారాల పాటు ఈ సాంగ్ ను షూట్ చేయాలని ప్లాన్ చేసాడు శంకర్.

ఈ అగ్ర దర్శకుడి సినిమాల్లో పాటలు ఎంత ప్రాచుర్యం పొందుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. శంకర్ చిత్రంలో సాంగ్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో కూడా సాంగ్స్ కు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించారట. ముఖ్యంగా ఈ సాంగ్ విషయానికొస్తే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సాంగ్ ను చిత్రీకరిస్తున్నాడట శంకర్.

- Advertisement -

సాధారణంగా బడ్జెట్ విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉండే దిల్ రాజు, శంకర్ కు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్ లో హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొంటోంది. చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం ఈ సాంగ్ చాలా ఏళ్ల పాటు నిలిచిపోయేలా ఉంటుందిట.

ఎస్ ఎస్ థమన్ ఈ సాంగ్ ను కంపోజ్ చేసాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే బయటకు రానుంది. తెలుగు, తమిళ్ లో రూపొందించనున్న ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All