Homeన్యూస్రామ్ చరణ్ - శంకర్ సినిమా మొదలయ్యేది అప్పుడే!

రామ్ చరణ్ – శంకర్ సినిమా మొదలయ్యేది అప్పుడే!

రామ్ చరణ్ - శంకర్ సినిమా మొదలయ్యేది అప్పుడే!
రామ్ చరణ్ – శంకర్ సినిమా మొదలయ్యేది అప్పుడే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత అగ్ర దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని రీసెంట్ గా ప్రకటించారు. శంకర్ తొలిసారి చేయబోతోన్న స్ట్రైట్ తెలుగు చిత్రమిది. అయితే ఈ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. హీరోయిన్ గా కియారా అద్వానీను ఫిక్స్ చేసిన విషయం తెల్సిందే. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ 22 నుండి మొదలవుతుంది. పూణేలో 20 రోజుల పాటు సాగే భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ ఇద్దరూ పాల్గొననున్నారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తారని సమాచారం.

- Advertisement -

పొలిటికల్ డ్రామా అయిన ఈ చిత్రంలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన టాప్ నటీనటులు కనిపిస్తారు. సునీల్, జయరాం పేర్లు ప్రస్తుతానికి చిత్ర యూనిట్ రివీల్ చేసారు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All