Homeన్యూస్ఏకంగా 5 భాషల్లో సలార్ ట్రైలర్!

ఏకంగా 5 భాషల్లో సలార్ ట్రైలర్!

Salaar trailer in 5 languages ​​simultaneously
Salaar trailer in 5 languages ​​simultaneously

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘సలార్’ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ ఇవాళ రానుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ డిసెంబర్ 1న సాయంత్రం 7.19 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమాను రెండు భాగాలు తెరకెక్కించగా, తొలి భాగాన్ని ‘సలార్-ది సీజ్ ఫైర్’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

తాజాగా రాబోతున్న ట్రైలర్ కట్ పవర్‌ప్యాక్డ్‌గా ఉండనుందనే టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుందని.. ఇది వారి ఊహలకు అందని విధంగా దర్శకుడు కట్ చేశారని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు వంటి విలక్షణ నటులు కూడా నటిస్తున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All