
సలార్ నుండి పవర్ ఫుల్ ప్రభాస్ పిక్ లీక్ అయ్యింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. దాదాపు నలబై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన పార్ట్ ను కూడా త్వరత్వరగా ఫినిష్ చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట.
రీసెంట్ గా కెజిఎఫ్ 2 మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడమే కాదు ..నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో సలార్ మూవీ ఫై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో గతంలో జరిగిన షూటింగ్ తాలూకా ఓ పిక్ బయటకు వచ్చింది. ఈ పిక్ లో ప్రభాస్ యాక్షన్ మూడ్ లో కనిపిస్తున్నాడు. ఈ పిక్ చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాను కూడా హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ తెరకెక్కిస్తున్నారు.