HomeUncategorizedలాస్ వేగాస్ లో చిల్ అవుతోన్న 'లైగర్' బాయ్స్

లాస్ వేగాస్ లో చిల్ అవుతోన్న ‘లైగర్’ బాయ్స్

లాస్ వేగాస్ లో చిల్ అవుతోన్న 'లైగర్' బాయ్స్
లాస్ వేగాస్ లో చిల్ అవుతోన్న ‘లైగర్’ బాయ్స్

విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూఎస్ లో ఉన్నాడు. డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ షూటింగ్ నిమిత్తం యూఎస్ వెళ్ళాడు. అక్కడ ఒక భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. అందులో ఒక ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్ కూడా ఉంటుందని తెలుస్తోంది. బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. తన కోసమే షెడ్యూల్ ను యూఎస్ లో ప్లాన్ చేసారు. షెడ్యూల్ మొదలుకావడానికి ఇంకా సమయం ఉండటంతో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ వేగాస్ లో చిల్ అవుతున్నారు.

వీరిద్దరూ ఉన్న ఫోటోను లైగర్ నిర్మాత ఛార్మి పోస్ట్ చేసింది. “భారీ షెడ్యూల్ ఇంకా మొదలుకావడానికి ముందు మా బాయ్స్ చిల్ అవుతున్నారు” అని పోస్ట్ చేసింది. చూస్తుంటే పూరి, విజయ్ లు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ ఈ వీకెండ్ కు ఏం చేయాలో మనకు ఒక సలహా కూడా ఇచ్చేసాడు.

- Advertisement -

ఈ వీకెండ్ పుష్పక విమానంతో ఎంజాయ్ చేయండి, మీకు మంచి టైమ్ పాస్. నాది గ్యారంటీ అని చెబుతూ ఒక వీడియో బైట్ ను ఇచ్చాడు. పుష్పక విమానం సినిమాను విజయ్ దేవరకొండ నిర్మించిన విషయం తెల్సిందే.

ఇవి కూడా చదవండి :

విజయ్ మాస్ డ్యాన్స్.. ముంబైలో లైగర్ సాంగ్ షూట్..!

మ్యాసివ్ అప్డేట్: లైగర్ లో బాక్సింగ్ కింగ్!!

లైగర్ టీమ్ కు సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య

లైగర్ లో ప్రీ క్లైమాక్స్ స్పెషలిటీ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All