
అప్పటిదాకా హీరోలు చాలా నిబద్ధతతో, వినమ్రంగా ఉండేవారు ఆ దర్శకుడు వచ్చేదాకా. అప్పటిదాకా విలన్లు స్టైలిష్ గా కాకుండా రౌడీల్లా ఉండేవారు అతను వచ్చేదాకా. హీరో క్యారెక్టరైజేషన్ తోనే సగం విజయం సాధించే ఆ దర్శకుడు పూరి జగన్నాథ్. హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రతీ హీరో కూడా పూరి దర్శకత్వంలో ఒక్క సారైనా నటించాలి అనుకుంటారు. హీరోలకు అలాంటి పాత్రలను డిజైన్ చేస్తాడు మరి. అలాంటి పూరి జగన్నాథ్ పుట్టినరోజు నేడు.
అగ్ర దర్శకుడైన ఎస్ ఎస్ రాజమౌళి ఒక సందర్భంలో నేను ఏళ్లకేళ్లు కష్టపడి, కిందా మీదా పడి సినిమాలు తీస్తుంటే పూరి జగన్నాథ్ కేవలం ఒక్క డైలాగ్ రాసి సీన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళతాడు అని పూరి పెన్ పవర్ గురించి గొప్పగా చెప్పాడు. పూరి పెన్ నుండి వచ్చేవి నిజానికి డైలాగ్స్ కాదు బులెట్స్. హీరోకు ఒక రకమైన రౌడీ బ్యాక్ డ్రాప్ ను సెట్ చేయడం, దాంతో కూడా హీరోయిజం పండించడం పూరి స్టైల్. పూరి అసలు శైలి ఇడియట్ సినిమాతో మొదలైందని చెప్పాలి.
“కమిషనర్ కూతుళ్ళకు మొగుళ్ళు రారా” అని రవితేజ పొగరుగా చెబుతుంటే యువత పిచ్చెక్కిపోయారు. అదే రవితేజ చేత “సంపాదించే అర్హత లేని వాడికి ప్రేమించే హక్కు లేదని చెప్పించి” యువతకు మార్గనిర్దేశికం చేసాడు. ఇక మహేష్ తో పూరి కాంబినేషన్ ఐకానిక్. అటు పోకిరి కానీ ఇటు బిజినెస్ మ్యాన్ కానీ దేనికదే ప్రత్యేకం. ఈ హీరోలు అనే కాదు పూరి ఏ హీరోతో టీమప్ అయినా కానీ వారికి కొత్త స్టైల్ ను నిర్దేశిస్తూ ఉంటాడు. అలాంటి పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్యాన్ ఇండియా అటెంప్ట్ లైగర్ తో మరింత ఉన్నత విజయం అందుకోవాలని కోరుకుంటోంది టాలీవుడ్.నెట్.