Homeటాప్ స్టోరీస్లైగర్ లో ప్రీ క్లైమాక్స్ స్పెషలిటీ

లైగర్ లో ప్రీ క్లైమాక్స్ స్పెషలిటీ

లైగర్ లో ప్రీ క్లైమాక్స్ స్పెషలిటీ
లైగర్ లో ప్రీ క్లైమాక్స్ స్పెషలిటీ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. లైగర్ లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్ స్పెషల్ హైలైట్ గా నిలుస్తుందిట.

ఇక్కడే ఒక పాత్ర సినిమాలో పరిచయం అయ్యి మొత్తం కథ స్వరూపాన్నే మార్చేస్తుందిట. సరిగ్గా ఈ పాత్ర కోసం మైక్ టైసన్ ను సంప్రదిస్తున్నారు పూరి జగన్నాథ్ అండ్ కో. అయితే ఇంకా మైక్ టైసన్ వర్గాల నుండి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -

ఛార్మి, పూరి జగన్నాథ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్నాడు. మొత్తంగా ఈ చిత్రం ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుందని సమాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All