
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాతో మరోసారి తన కసి చూపించాలని చూస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ముంబైలో లైగర్ సాంగ్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది. విజయ్ మాస్ డ్యాన్స్ తో ఈ సాంగ్ థియేటర్ లో అదరగొట్టేయడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచుతూ 2022లో లైగర్ సినిమాతో ఇండియా షేక్ అవుతుందని విజయ్ సెన్సేషనల్ కామెంట్ రౌడీ ఫ్యాన్స్ కు బాగా ఎక్కేసాయి. ఇక ఇప్పుడు సినిమాలో విజయ్ డ్యాన్స్ తో కూడా అదరగొట్టేస్తాడని చెబుతున్నారు.
విజయ్ మాస్ డ్యాన్స్ ఆడియెన్స్ కు సూపర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. పూరీ, విజయ్ దేవరకొండ ఇద్దరి కాంబినేషన్ లో ఊర మాస్ మూవీగా లైగర్ వస్తుంది. సినిమాలో బాక్సర్ వీరుడు మైక్ టైసన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న లైగర్ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా వస్తున్న ఈ క్రేజీ అప్డేట్స్ ఆ అంచనాలను డబుల్ చేస్తున్నాయి.