Homeటాప్ స్టోరీస్సైమా అవార్డ్స్ కు నామినేట్ అయిన సినిమాలు ఇవే

సైమా అవార్డ్స్ కు నామినేట్ అయిన సినిమాలు ఇవే

SIIMA Awards 2018 List సైమా అవార్డ్స్ 2018 కి నామినేట్ అయ్యాయి పలు చిత్రాలు అయితే అందులో ఏకంగా 12 కేటగిరీ లలో నామినేట్ అయ్యింది మాత్రం ” బాహుబలి 2” చిత్రం . 12 కేటగిరీ లలో బాహుబలి 2 తరుపున నామినేట్ అయిన వాళ్ళ లిస్ట్ ఇలా ఉంది . ఎస్ ఎస్ రాజమౌళి , ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ , శోభు యార్లగడ్డ , సుబ్బరాజు ,సత్యరాజ్ , ఎం ఎం కీరవాణి , శివశక్తి దత్తా , సెంథిల్ కుమార్ తదితరులున్నారు . ఇక వీటితో పాటుగా పలు చిత్రాలు పోటీపడుతున్నాయి . ఈ అవార్డుల వేడుక సెప్టెంబర్ 14 , 15 తేదీలలో రెండు రోజుల పాటు దుబాయ్ లో ఘనంగా నిర్వహించనున్నారు .

ఇక మిగతా సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 , బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి , విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రాలు ఉన్నాయి . భారీ ఎత్తున ఈ వేడుకలు దుబాయ్ లో జరుగనున్నాయి . ఉత్తమ నటుడు కేటగిరీ లలో బాలయ్య , ప్రభాస్ , విజయ్ దేవరకొండ , జూనియర్ ఎన్టీఆర్ , రానా లు పోటీ పడుతున్నారు . బాహుబలి 2 కి ఎన్ని అవార్డులు దక్కుతాయో ? ఉత్తమ నటుడిగా ఎవరు నిలుస్తారో చూడాలి .

- Advertisement -

English Title: SIIMA Awards 2018 List

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All