Homeటాప్ స్టోరీస్కేటీఆర్ కు సవాల్ విసిరిన రాజమౌళి

కేటీఆర్ కు సవాల్ విసిరిన రాజమౌళి

ss rajamouli challenges ktrఈరోజు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు కావడంతో ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సవాల్ విసిరాడు . రాజమౌళి ఏంటి ? కేటీఆర్ కు సవాల్ విసరడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మొక్కలు నాటడంలో భాగంగా దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి కి ఛాలెంజ్ విసిరింది మూడు మొక్కలు నాటాలని , ఆ సవాల్ ని స్వీకరించిన జక్కన్న అలియాస్ రాజమౌళి మూడు మొక్కలను నాటి మరో ముగ్గురికి ఆ సవాల్ ని విసిరాడు . ఆ ముగ్గురిలో యువ నాయకుడు కేటీఆర్ కూడా ఒకరు కావడం ఈరోజు అతడి పుట్టినరోజు కావడం విశేషం .

ఇక జక్కన్న సవాల్ విసిరిన వాళ్లలో మిగతా ఇద్దరు ఎవరని అనుకుంటున్నారా ? బ్యాడ్మింటన్ క్రీడాకారుడు , కోచ్ పుల్లెల గోపీచంద్ ఒకరు కాగా మరొకరు అర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించిన దర్శకులు సందీప్ రెడ్డి వంగా కావడం విశేషం . కవిత గారి సవాల్ స్వీకరించాను , మొక్కలు నాటాను ఇక మీరు నా సవాల్ ని స్వీకరించండి అంటూ కేటిఆర్ , పుల్లెల గోపీచంద్ , సందీప్ రెడ్డి వంగా లకు ఛాలెంజ్ విసిరాడు . ఇక వాళ్ళు ఆ సవాల్ ని ఎవరు? ఎప్పుడు? ఎలా ? స్వీకరిస్తారో చూడాలి .

- Advertisement -

English Title:  ss rajamouli challenges ktr

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All