Homeటాప్ స్టోరీస్అనుష్క కు ప్రభాస్ లాంటి భర్త కావాలట

అనుష్క కు ప్రభాస్ లాంటి భర్త కావాలట

anushka mother responds on anushka and prabhas rumoursసాలిడ్ అందాల భామ అనుష్క కు ప్రభాస్ లాంటి మిస్టర్ పర్ ఫెక్ట్ భర్త గా రావాలని కోరుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది అనుష్క తల్లి ప్రఫుల్లా శెట్టి . ప్రభాస్ – అనుష్క ల మధ్య గతకొంత కాలంగా పెళ్లి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే . అయితే ఆ వార్తలను ఎప్పటికప్పుడు అనుష్క కానీ ప్రభాస్ కానీ ఖండిస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఆ వార్తలకు అంతేలేకుండా పోతోంది . ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి .

తాజాగా అనుష్క తల్లి ప్రఫుల్లా శెట్టి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి . ప్రభాస్ లాంటి వాడు అనుష్క కు భర్తగా లభిస్తే సంతోషం కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అని , కానీ వాళ్లిద్దరి పై వస్తున్న గాసిప్స్ మమ్మల్ని ఆవేదనకు గురి చేస్తోందని అంటోంది ప్రఫుల్లా శెట్టి . ప్రభాస్ తో ఎక్కువ సినిమాల్లో అనుష్క నటించడంతో ఈ రూమర్స్ పుట్టుకొస్తున్నాయి . ఇక ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన పలువురు పెళ్లి చేసుకోవడం తో ఈ జంట పై కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి . అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి సమాయత్తం అవుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All