Homeటాప్ స్టోరీస్చైనాలో బాహుబలి 2 కూడా ప్లాప్ అయ్యింది

చైనాలో బాహుబలి 2 కూడా ప్లాప్ అయ్యింది

baahubali 2 flop in chinaతెలుగు సినిమా బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఒక్క చైనాలో తప్ప . అన్ని రాష్ట్రాలలో , దేశాలలో భారీ వసూళ్లు సాధిస్తే చైనాలో మాత్రం డిజాస్టర్ అయ్యింది బాహుబలి దాంతో బాహుబలి 2 ని చాలా జాగ్రత్తలు తీసుకొని చైనాలో విడుదల చేసారు తాజాగా కట్ చేస్తే మొదటి రోజు భారీగానే వసూళ్లు సాధించింది కానీ రెండో రోజు నుండి చతికిల బడింది దాంతో బాహుబలి 2 కూడా చైనాలో ప్లాప్ అయ్యింది . బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది కానీ చైనాలో మాత్రం బాహుబలి 2 పప్పులు ఉడకలేదు దాంతో ట్రేడ్ విశ్లేషకులు బాహుబలి 2 ని ప్లాప్ గా తేల్చేసారు .

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ , రానా , రమ్యకృష్ణ , అనుష్క , తమన్నా , సత్యరాజ్ తదితరులు నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు . ప్రభాస్ కు బాహుబలి చిత్రంతో ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది , మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది . బాహుబలి 2 పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ చిత్ర బృందం . భారీ వసూళ్లు సాధించిన బాహుబలి 2 ని చైనా వాళ్ళు ఆదరించకపోవడంతో కారణాలు వెదుకుతున్నారు మనవాళ్ళు . అయితే చైనా వాళ్లకు బాహుబలి లాంటి చిత్రాలు కొత్త కాదు చాలా ఏళ్ల క్రితమే ఇలాంటి చిత్రాలను చూసి ఉన్నారు దాంతో పెద్దగా దీనికి ఆకర్షితులు కాలేదేమో !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All