Homeటాప్ స్టోరీస్చిరు - కొరటాల ఇది కూడా స్ట్రాంగ్ మెసేజ్ అట

చిరు – కొరటాల ఇది కూడా స్ట్రాంగ్ మెసేజ్ అట

koratala siva another social message film with chiranjeeviచిరంజీవికొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే . భరత్ అనే నేను చిత్రంతో ఇటీవలే సంచలన విజయాన్ని అందుకున్న కొరటాల తన తదుపరి సినిమాని చిరంజీవి తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఇక ఈ సినిమాని కూడా స్ట్రాంగ్ మెసేజ్ తో తీర్చిదిద్దడానికి సిద్దమయ్యాడట కొరటాల శివ . ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను చిత్రాలన్నీ కూడా సోషల్ మెసేజ్ ఉన్న చిత్రాలే కావడం విశేషం .

ఇక ఇప్పుడు చిరంజీవి తో చేసే సినిమా కూడా అంతకంటే స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా చేయాలనీ కసిగా ఉన్నాడట కొరటాల , చిరంజీవికి చెప్పిన కథ నచ్చడంతో ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది , ఇక ఈ సినిమాని నవంబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు తన స్టామినా ఇంకా తగ్గలేదని వసూళ్ల తో నిరూపించాడు . ఇక ఇప్పుడేమో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం చేస్తున్నాడు . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ్ , హిందీ లలో చిత్రీకరిస్తున్నారు . ఈ సినిమాతో తన మార్కెట్ ని మరింతగా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు చిరు .

- Advertisement -

English Title: koratala siva another social message film with chiranjeevi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All