Homeటాప్ స్టోరీస్శైలజారెడ్డి అల్లుడు టీజర్ టాక్

శైలజారెడ్డి అల్లుడు టీజర్ టాక్

sailaja reddy alludu teaser talkఅక్కినేని నాగచైతన్యఅను ఇమ్మాన్యు యేల్ జంటగా మారుతి దర్శకత్వంలో నటించిన చిత్రం ” శైలజారెడ్డి అల్లుడు ” ఈనెల ఆఖరున విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ ని వదిలారు , ఆ టీజర్ ని చూస్తుంటే రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని చెప్పకనే చెప్పినట్లు అవుతోంది . నాగార్జున హీరోగా నటించిన ” అల్లరి అల్లుడు ” మాదిరిలా మాస్ ఎంటర్ టైనర్ లా కనిపిస్తోంది ఈ శైలజారెడ్డి అల్లుడు . విచిత్రం ఏంటంటే అల్లరి అల్లుడు చిత్రంలో నాగార్జున తో ఐటెం సాంగ్ చేసింది రమ్యకృష్ణ కట్ చేస్తే ఇప్పుడు నాగచైతన్య కు అత్తగా శైలజారెడ్డి గా నటించింది .

పొగరుబోతు అత్త అంటే రమ్యకృష్ణ సరిగ్గా సరిపోతుంది అందుకే ఈ భామని అత్తగా ఎంచుకున్నారట ! 80 – 90 వ దశకంలో పలు సూపర్ హిట్ చిత్రాలు అత్తా – అల్లుడు నేపథ్యంలోనే రూపొందాయి . అత్తా – అల్లుడు కాన్సెప్ట్ ఎవరు గ్రీన్ దాంతో మళ్ళీ ఇన్నాళ్లకు దాన్ని టచ్ చేస్తున్నాడు మారుతి . మాస్ మసాలా చిత్రంగా ఈ శైలజారెడ్డి అల్లుడు రూపొందినట్లు తెలుస్తోంది దాంతో సినిమా విజయం పై చాలా నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర బృందం . అందుకే ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక టీజర్ చూస్తుంటే మాస్ ఎంటర్ టైనర్ అని తెలుస్తూనే ఉంది కాబట్టి యూత్ ని ఆకట్టుకునే సినిమా అవుతుందనే అంటున్నారు .

- Advertisement -

English Title: sailaja reddy alludu teaser talk

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All