Homeటాప్ స్టోరీస్అర్జున్ రెడ్డి చూసాక అల్లు అర్జున్ కు నిద్ర పట్టలేదట

అర్జున్ రెడ్డి చూసాక అల్లు అర్జున్ కు నిద్ర పట్టలేదట

allu arjun sleepless nights with arjun reddyఅర్జున్ రెడ్డి చిత్రాన్ని చూసిన తర్వాత నాకు వారం రోజులు నిద్ర పట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు అల్లు అర్జున్ . మనం చేస్తున్న సినిమాలు ఏంటి ? అర్జున్ రెడ్డి లాంటి చిత్రాలను చేయలేమా ? అని మదన పడ్డాడట అల్లు అర్జున్ ఈ విషయాన్నీ ఈ హీరో నే స్వయంగా చెప్పడం విశేషం . నిన్న సాయంత్రం ”గీత గోవిందం ” ఆడియో వేడుక జరుగగా ఆ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అథితిగా హాజరయ్యాడు . గీత గోవిందం చిత్రాన్ని చూశానని , సినిమా చాలా బాగుందని విజయ్ దేవరకొండ -రష్మిక మండన్నా నటన అద్భుతమని కొనియాడాడు అల్లు అర్జున్ . అయితే తన కొత్త సినిమా ఇప్పట్లో లేదని , దాని గురించి నేను చెప్పేవరకు ఎవరూ అడగొద్దని అభిమానులను కోరాడు అల్లు అర్జున్ .

విజయ్ దేవరకొండ – రష్మిక మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం చిత్రాన్ని నిర్మించింది అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు దాంతో ఈ వేడుకకు ముఖ్య అథితి గా వచ్చాడు . న పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఘోర పరాజయం పొందడంతో ఈసినిమా చేయాలో తెలీక ఇబ్బంది పడుతున్నాడు అల్లు అర్జున్ . అందుకే కొంత గ్యాప్ తీసుకుంటున్నాడు . త్వరలోనే ఏ సినిమా చేయబోయేది ప్రకటిస్తాడట ఈ హీరో .

- Advertisement -

English Title: allu arjun sleepless nights with arjun reddy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All