Homeటాప్ స్టోరీస్గీత గోవిందం కాపీ కథనా ?

గీత గోవిందం కాపీ కథనా ?

copy complaint on vijay devarakondas geetha govindam విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” గీత గోవిందం ”. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు చిక్కులు వచ్చి పడ్డాయి . ఆగస్టు 15న సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా గీత గోవిందం కథ నాదని ఓ వ్యక్తి రచయితల సంఘం కు పిర్యాదు చేయడంతో ఆ పిర్యాదుని స్వీకరించిన సంఘం విచారణ చేపట్టిందట ! ఇరు వర్గాలను పిలిపించి వివరాలను తీసుకుందని తెలుస్తోంది . ఇక నిర్ణయానికి రావడమే తరువాయి అని తెలుస్తోంది .

రచయితల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో కానీ ఈమధ్య చాలా చిత్రాలకు కాపీ కథలు అనే ముద్ర పడింది . పలు చిత్రాలు ఈ ఆరోపణలు ఎదుర్కొన్నాయి అయితే అబ్బే ! మా కథ ఎక్కడా కాపీ కొట్టలేదని , మా స్వంతమని అన్నారు కట్ చేస్తే సినిమా కథ , రచయిత కథ దాదాపుగా ఒకేలా ఉండటం తో కొన్ని రాజీల కొచ్చారు మరికొంతమంది రాజీకి రాకపోవడంతో సదరు రచయితలు కోర్టు ని ఆశ్రయించారు . ఇక ఈ గీత గోవిందం కథ ఏమౌతుందో ! దర్శకత్వ శాఖలో పనిచేసిన నివాస్ అనే వ్యక్తి గీత గోవిందం కథ ని రాసుకున్నాడట దాన్ని కమెడియన్ జోగి నాయుడు తో తీయాలని అనుకున్నాడట కానీ కుదరలేదు కట్ చేస్తే అదే కథ తో ఈ సినిమా తెరకెక్కింది అని నివాస్ కి తెలియడంతో రచయితల సంఘం ని ఆశ్రయించాడు . అదీ విషయం .

- Advertisement -

English Title: copy complaint on vijay devarakondas geetha govindam

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts