Homeటాప్ స్టోరీస్తమిళ అర్జున్ రెడ్డి లో హీరోయిన్ ఈ భామే నట

తమిళ అర్జున్ రెడ్డి లో హీరోయిన్ ఈ భామే నట

young heroine shriya sharma in tamil arjun reddy తెలుగునాట సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు . తమిళ్ లో అగ్ర హీరో అయిన చియాన్ విక్రమ్ తన తనయుడి ని అర్జున్ రెడ్డి రీమేక్ తో తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు . తమిళనాట ప్రముఖ దర్శకులైన బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . ఇక ఈ సినిమా కి తమిళ్ లో పెట్టిన పేరు ఏంటో తెలుసా ……. ” వర్మ ” . వివాదాస్పద రాంగోపాల్ వర్మ లోని చివరి రెండు అక్షరాలను టైటిల్ గా పెట్టుకున్నారు .

చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కాబట్టి హీరోయిన్ కు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి పలువురు హీరోయిన్ లను వడపోస్తున్నారు అయితే చివరకు శ్రియా శర్మ ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట ! బాలనటిగా పలు చిత్రాల్లో నటించింది ఈ భామ . తెలుగులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ” నిర్మలా కాన్వెంట్ ” చిత్రంలో హీరోయిన్ గా నటించింది శ్రియా శర్మ .

- Advertisement -

ఈ భామని హీరోయిన్ గా ఎంపిక చేయడం దాదాపుగా ఖరారు అయ్యిందని సమాచారం . తెలుగునాట ప్రభంజనం సృష్టించిన అర్జున్ రెడ్డి తమిళనాట ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి . అలాగే బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ చిత్రంలో శ్రియా శర్మ ఎలా రెచ్చిపోతుందో తెలియాలంటే వర్మ విడుదల అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: young heroine shriya sharma in tamil arjun reddy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts