
న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తోన్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. నాని అంటే మినిమం గ్యారంటీ ఉన్న బ్యాంకబుల్ హీరో. కానీ నాని గత రెండు సినిమాలు ఓటిటిలో విడుదలై కొంత నిరుత్సాహపరిచాయి. ఆ బాకీలు మొత్తం తీర్చేసుకోవడానికి శ్యామ్ సింగ రాయ్ ను థియేటర్లలో దింపుతున్నాడు. శ్యామ్ సింగ రాయ్ టీజర్ ఈరోజు విడుదలైంది. పూర్తిగా బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్ మధ్య జరిగే చిత్రంగా టీజర్ చూస్తే అర్ధమవుతోంది.
ఒక సీరియస్ టాపిక్ చుట్టూ కథను నడిపించినట్లు తెలుస్తోంది. “అడిగే అండ లేదు, కలబడే కండ లేదని రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే కాగితం కడుపు చీల్చుకుపుట్టి రాయడమే కాదు కాలరాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే” అన్న బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో శ్యామ్ సింగ రాయ్ టైటిల్స్ పడటం నిజంగా సూపర్బ్ గా ఉంది.
నాని ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా, సంఘసంస్కర్తగా కనిపించబోతున్నాడు. అలాగే నాని బెంగాలీలో చెప్పిన డైలాగ్ కూడా అదిరింది. “ఆడది ఏ ఎవరికీ దాసి కాదు, ఆ దేవుడికి కూడా”.
సాయి పల్లవి, కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలవుతోంది.
ఇవి కూడా చదవండి:
శ్యామ్ సింగ రాయ్: నాని వెనక్కి తగ్గుతాడా?
నాని మాస్ లుక్ తో శ్యామ్ సింగ రాయ్ టీజర్ అప్డేట్
శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ సాంగ్.. ది రైజ్ ఆఫ్ శ్యాం ప్రోమో రిలీజ్..!
నెట్ ఫ్లిక్స్ కు అమ్ముడుపోయిన శ్యామ్ సింగ రాయ్!!
