
న్యాచురల్ స్టార్ నాని గత రెండు సినిమాలు అన్ని విధాలుగా నిరాశపరిచాయి. బయట ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాలు థియేటర్లలో విడుదల కాలేదు. వి, టక్ జగదీష్ రెండూ కూడా ఓటిటిలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకు కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ సినిమా కచ్చితంగా థియేటర్లలోనే విడుదలవుతుంది అని ప్రామిస్ చేసాడు నాని.
నాని నుండి రానున్న నెక్స్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్. బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాహుల్ సంకిట్ర్యాన్ డైరెక్ట్ చేసాడు. నాని భిన్నమైన లుక్స్ లో ఈ చిత్రంలో కనిపించనున్నాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. శ్యామ్ సింగ రాయ్ కాన్సెప్ట్ పైనే నాని నమ్మకంగా ఉన్నాడు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల చేయనున్నారు. వెంకట్ బోయినపల్లి శ్యామ్ సింగ రాయ్ ను నిర్మించాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా టీజర్ అప్డేట్ ను వదిలారు. నవంబర్ 18న ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. శ్యామ్ సింగ రాయ్ కు సంబంధించిన మరిన్ని ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి.
Also Read:
నాలుగు భాషల్లో అల్లు అర్జున్ కు పోటీగా న్యాచురల్ స్టార్!
హ్రితిక్ రోషన్ చేస్తాడేమో: నాని
అల్లు అర్జున్ ‘ఐకాన్’ మళ్ళీ మూలన పడిందా?
Witness the Ardent Rebellion with a cause!
The Thumping Teaser of #ShyamSinghaRoy? Releasing on Nov 18th! #SSRTeaser ?
Natural ? @NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @Rahul_Sankrityn @NiharikaEnt @SSRTheFilm
#SSRonDEC24th ? pic.twitter.com/JhURz8EF8O— BA Raju’s Team (@baraju_SuperHit) November 11, 2021