Homeటాప్ స్టోరీస్శ్యామ్ సింగ రాయ్: నాని వెనక్కి తగ్గుతాడా?

శ్యామ్ సింగ రాయ్: నాని వెనక్కి తగ్గుతాడా?

శ్యామ్ సింగ రాయ్: నాని వెనక్కి తగ్గుతాడా?
శ్యామ్ సింగ రాయ్: నాని వెనక్కి తగ్గుతాడా?

న్యాచురల్ స్టార్ నాని నుండి గత రెండేళ్లుగా థియేటర్లో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. నాని రీసెంట్ రెండు సినిమాలు వి, టక్ జగదీష్ కూడా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు కూడా అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. దీంతో తన చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లలో విడుదల చేసి హిట్ కొట్టి మిడ్-రేంజ్ హీరోలలో తాను నమ్మదగ్గ స్టార్ అని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.

నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ ను డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపాడు. సరికొత్త కథతో తెరకెక్కిన ఈ సినిమాపై నాని చాలా నమ్మకంగా ఉన్నాడు.

- Advertisement -

ఐతే ఇప్పుడు అదే రిలీజ్ డేట్ కు వరుణ్ తేజ్ గని కూడా వస్తోంది. అల్లు అరవింద్ పెద్దబ్బాయి అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శ్యామ్ సింగ రాయ్ నిర్మాతలను విడుదల తేదీ వాయిదా వేసుకోమని అల్లు క్యాంప్ ప్రెజర్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో నాని ఏం చేస్తాడు? వెనక్కి తగ్గుతాడా? లేక బాక్స్ ఆఫీస్ బరిలో తేల్చుకుంటాడా? వాయిదా వేసుకుంటే మరో విడుదల తేదీ పట్టుకోవడం చాలా కష్టం కూడా.

ఇవి కూడా చదవండి:

నాని మాస్ లుక్ తో శ్యామ్ సింగ రాయ్ టీజర్ అప్డేట్

శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ సాంగ్.. ది రైజ్ ఆఫ్ శ్యాం ప్రోమో రిలీజ్..!

నెట్ ఫ్లిక్స్ కు అమ్ముడుపోయిన శ్యామ్ సింగ రాయ్!!

మొత్తానికి శ్యామ్ సింగ రాయ్ ను నాని హోల్డ్ లో పెట్టాడా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All