Homeటాప్ స్టోరీస్శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ సాంగ్.. ది రైజ్ ఆఫ్ శ్యాం ప్రోమో రిలీజ్..!

శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ సాంగ్.. ది రైజ్ ఆఫ్ శ్యాం ప్రోమో రిలీజ్..!

నాచురల్ స్టార్ నాని, రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 1970 కలకత్తా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇక సినిమాలో నాని పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్. శ్యాం పాత్ర కోసం నాని డిఫరెంట్ లుక్ ట్రై చేశాడు. ఇక సినిమా నుండి మొదటి సాంగ్ ది రైజ్ ఆఫ్ శ్యామ్ సాంగ్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

- Advertisement -

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ది రైజ్ ఆఫ్ శ్యామ్ సాంగ్ ను కృష్ణ కాంత్ రాయగా అనురాగ్ కులకర్ణి, విశాల్ డడ్లాని, సిగ్గీ పాడారు. ఇక ఈ సినిమాలోని ఈ సాంగ్ ఫుల్ సాంగ్ ను నవంబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. ఇక డిసెంబర్ 24న నాని శ్యాం సింగ రాయ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వి, టక్ జగదీష్ తో నిరాశపరచిన నాని శ్యామ్ సింగ రాయ్ తో సత్తా చాటాలని చూస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటుగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమాగా వస్తుందని తెలుస్తుంది.

 

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All