HomeVideosమరోసారి డబల్ సెంచరీ బాదేసిన సాయి పల్లవి

మరోసారి డబల్ సెంచరీ బాదేసిన సాయి పల్లవి

మరోసారి డబల్ సెంచరీ బాదేసిన సాయి పల్లవి
మరోసారి డబల్ సెంచరీ బాదేసిన సాయి పల్లవి

మలయాళీ ముద్దు గుమ్మ సాయి పల్లవి తెలుగులో ఎంత ఫేమ్ సంపాదించుకుందో మనందరికీ తెలుసు. తొలి సినిమాతోనే అందరినీ ఫిదా చేసేసింది. ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్సులకు పెట్టింది పేరన్న విషయం తెల్సిందే. తన సినిమాల్లో ఒక్క సాంగ్ అయినా చార్ట్ బస్టర్ అవుతుంటుంది. ఫిదా చిత్రంలో వచ్చిండే పాట ఎంత పెద్ద సక్సెస్ అన్నది మనం చూసాం. అలాగే తెలుగులో మరోసారి సాయి పల్లవి సాంగ్ మార్మోగిపోతోంది.

లవ్ స్టోరీ చిత్రంలోని సారంగ దరియా సాంగ్ విడుదలైన రోజు నుండే మిలియన్స్ వ్యూస్ ను సాధిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు నుండి వేగంగా 100 మిలియన్ వ్యూస్ ను సాధించింది ఈ సాంగ్. ఇక ఇప్పుడు మరో మైల్ స్టోన్ ను చేరుకుంది. సారంగా దరియా సాంగ్ ఇప్పుడు 200 మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. ఈ ఫీట్ అందుకున్న మూడో సాయి పల్లవి సాంగ్ ఇది.

- Advertisement -

ఇప్పటికే రౌడీ బేబీ సాంగ్ 1 బిలియన్ వ్యూస్ ను సాధించింది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All