Homeన్యూస్మెగాస్టార్ సినిమాలో రవితేజ ఫిక్స్ అయినట్లేనా?

మెగాస్టార్ సినిమాలో రవితేజ ఫిక్స్ అయినట్లేనా?

మెగాస్టార్ సినిమాలో రవితేజ ఫిక్స్ అయినట్లేనా?
మెగాస్టార్ సినిమాలో రవితేజ ఫిక్స్ అయినట్లేనా?

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత గేర్ మార్చాడన్న విషయం తెల్సిందే. వరసగా సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ సాగుతోంది. రీసెంట్ గా చిరుకు చిన్న సర్జరీ జరగడంతో బ్రేక్ వచ్చింది కానీ మళ్ళీ త్వరలోనే మొదలవుతుంది. ఈ సినిమా కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే.

బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమా ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా విడుదల చేసారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్ర కీలకంగా ఉంటుందిట. దానికోసం ముందుగా పవన్ కళ్యాణ్ ను అనుకున్నారట. కానీ పవన్ చేయడం కుదరదని తేలిపోవడంతో నెక్స్ట్ ఆప్షన్ ను చూసుకుని మాస్ మహారాజా రవితేజను సంప్రదించారని తెలుస్తోంది.

- Advertisement -

చిరు సినిమా కావడంతో రవితేజ మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పేశాడట. గతంలో అన్నయ్య చిత్రంలో చిరుకి తమ్ముడిగా రవితేజ నటించిన విషయం తెల్సిందే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి అదే తరహా రోల్ ను చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

ఇవి కూడా చదవండి:

మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా?

మాస్ రాజా ర‌వితేజకు ప్ర‌తి రోజు సండేన‌ట‌!

మాస్‌రాజా మ‌ళ్లీ సాహ‌స‌మే చేస్తున్నాడా?

80s రీయూనియన్ కు బాలయ్యను పిలవట్లేదా?  లేక..

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All