Homeగాసిప్స్మాస్‌రాజా మ‌ళ్లీ సాహ‌స‌మే చేస్తున్నాడా?

మాస్‌రాజా మ‌ళ్లీ సాహ‌స‌మే చేస్తున్నాడా?

మాస్‌రాజా మ‌ళ్లీ సాహ‌స‌మే చేస్తున్నాడా?
మాస్‌రాజా మ‌ళ్లీ సాహ‌స‌మే చేస్తున్నాడా?

టాలీవుడ్ హీరోల‌కి కొత్త‌గా పూన‌కం మొద‌లైందా? ఏడాదికి ఒక‌టి అర చిత్రాల్లో మాత్ర‌మే న‌టించే స్టార్ హీరోలు ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు స్టార్ ప్రొడ్యూస‌ర్స్ షాక్‌కు గుర‌య్యేలా వ‌రుస సినిమాల‌తో స్పీడు పెంచేస్తున్నారు. ఈ రేసులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ముందు వ‌రుస‌లో వుండ‌గా ఆ త‌రువాత స్థానంలో నేచుర‌ల్ స్టార్ నాని వున్నాడు. అదే లైన్‌లో నితిన్ వుండ‌గా తాజాగా ఈ లిస్టులోకి మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా చేరిపోయాడు.

`డిస్కోరాజా` త‌న కెరీర్‌కు కొత్త ఊపునిస్తుంద‌ని కొండంత ఆశ‌తో సినిమా చేసిన ర‌వితేజ ఆ మూవీ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో కొంత షాక్ కు గురైనా వెంట‌నే తేరుకుని వ‌రుస చిత్రాల్ని అంగీక‌రిస్తూ షాకులిస్తున్నాడు. ప్ర‌స్తుతం `క్రాక్‌` చిత్రాన్ని పూర్తి చేసేప‌నిలో వున్న ర‌వితేజ ఆ వెంట‌నే ర‌మేష్ వ‌ర్మ‌తో కొత్త చిత్రాన్ని మొద‌లుపెట్ట‌బోతున్నాడు.

- Advertisement -

ఇదిలా వుంటే ఈ రెండు చిత్రాల‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కుల్ని ఓకే చేసిన‌ట్టు తెలుస్తోంది. `నేను లోక‌ల్‌` ఫేమ్ త్రినాథ‌రావు న‌క్కిన చెప్పిర పోలీస్ స్టోరీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన మాస్‌రాజా వ‌క్కంతం వంశీకి తాజాగా ఓకే చెప్ప‌డం అంద‌రికి షాకిస్తోంది. అల్లు అర్జున్‌తో `నా పేరు సూర్య‌` చిత్రాన్ని రూపొందించి తొలి చిత్రంతోనే భారీ డిజాస్ట‌ర్‌ని సొంతం చేసుకున్నారు వ‌క్కంతం వంశీ. అలాంటి అత‌నికి మ‌రో సినిమా ఇవ్వ‌డానికి హీరోలు జంకుతుంటే ర‌వితేజ మాత్రం ఆఫ‌ర్ ఇవ్వడం నిజంగా గ్రేటే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All