
కొంత విరామం తరువాత వరుస చిత్రాల్ని లైన్‌లో పెట్టిన పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అటు రాజకీయాల్ని, ఇటు సినిమాల్ని సమానంగా మేనేజ్ చేస్తూ వెళుతున్నారు. చక్కని ప్లానింగ్‌తో షాకిస్తున్నారు. ఇటు సినిమా షెడ్యూల్‌ని పూర్తి చేస్తూనే చిన్న విరామం దొరికితే రాజకీయ మీటింగ్‌కు కేటాయిస్తూ బ్యాలెన్డ్స్‌గా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. `పింక్` రీమేక్‌ని యాభై శాతం ఇప్పటికే పూర్తి చేసిన పవర్‌స్టార్ క్రిష్ సినిమాని తెలియకుండానే పరుగులు పెట్టిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
బిజీ షెడ్యూల్‌లో ఇటు రాజకీయాలకు, సినిమాలకు టైమ్‌ని కరెక్ట్‌గా కేటాయిస్తున్న పవన్ ఇప్పటికే క్రిష్‌తో చేస్తున్న జానపద చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ని పూర్తి చేసేశాడట. త్వరలోనే మరో షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నారట. వచ్చే వారమే క్రిష్ మూవీ తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. తెలంగాణ రాబిన్ హుడ్ పండుగల సాయన్న జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్నిక్రిష్ తెరకెక్కిస్తున్నాడు. కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
ఏ.ఎం. రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించడం ఖాయమని, మొఘల్ ఎంపరర్ కాలం నాటి సంఘటనల సమాహారంగా అల్లా వుద్దీన్ ఖల్జీ పాత్రని కూడా ఇందులో చూపించబోతుండటంతో సినిమాపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎక్కడా ఆ అంచనాలకు తగ్గకుండా టెర్రిఫిక్ ప్లానింగ్‌తో క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.