Homeటాప్ స్టోరీస్`పింక్‌` రీమేక్ కోసం మ‌రో టైటిల్‌!

`పింక్‌` రీమేక్ కోసం మ‌రో టైటిల్‌!

Pawankalyan as Vakeel saab
Pawankalyan as Vakeel saab

ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం బాలీవుడ్ హిట్  ఫిల్మ్ `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతోంది. దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప‌వ‌న్ న‌టిస్తున్న 26వ సినిమా ఇది.

ఈ సినిమా ప్రారంభం నుంచి వ‌రుస లీకుల‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. తొలి రోజు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌డిచి వెళుతున్న స్టిల్స్ బ‌య‌టికి రావ‌డంతో సెట్‌లో పెద్ద దుమార‌మే చెల‌రేగింది. దిల్ రాజు సీన్‌లోకి రావ‌డంతో అంతా సెట్ట‌యిపోయింది. తాజాగా మరోసారి ఏకంగా వీడో ఫులేజ్ బ‌య‌టికి రావ‌డంతో టీమ్‌పై సీరియ‌స్ అయ్యార‌ట‌. ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు `లాయ‌ర్ సాబ్‌` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. తాజాగా మ‌రో వార్త షికారు చేస్తోంది.

- Advertisement -

ఈ చిత్రానికి `వ‌కీల్ సాబ్‌` అనే టైటిల్‌ని నిర్మాత దిల్‌రాజు రిజిస్ట‌ర్ చేయించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌థ‌కు ఈ టైటిల్ క‌రెక్ట్ యాప్ట్‌గా వుంటుంద‌ని చిత్ర వ‌ర్గాల్లో వినిపిస్తోంది. టైటిల్‌ని, ఫ‌స్ట్‌లుక్‌ని ఉగాది రోజున‌ రివీల్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో మాంచి ఝోస్ మీదున్న త‌మ‌న్ ఈ చిత్రం కోసం అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేశార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All