Homeగాసిప్స్మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా?

మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా?

మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా?
మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా?

మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ ప్రాజెక్ట్ ప్రీ లుక్ ను విడుదల చేసారు. అందులో చిరంజీవి అదిరిపోయాడు. వైజాగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని అర్ధమవుతోంది. అలాగే వాల్తేర్ వీర్రాజుగా చిరంజీవి కనిపిస్తాడని సమాచారం.

ముందుగా ఈ చిత్రంలో చిరు డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని ప్రచారం జరిగింది కానీ తాజాగా మరింత ఆసక్తికర రూమర్ ఒకటి మొదలైంది. చిరంజీవి – బాబీ చిత్రంలో మరో లీడ్ రోల్ ఉందిట. ఆ రోల్ కోసం మాస్ మహారాజా రవితేజను అనుకుంటున్నారని తెలుస్తోంది. రవితేజ కూడా చిరంజీవి సినిమా అంటే కాదనే అవకాశాల్లేవు. పైగా బాబీను దర్శకుడిగా పరిచయం చేసింది కూడా రవితేజనే.

- Advertisement -

గతంలో చిరంజీవి నటించిన అన్నయ్య చిత్రంలో తమ్ముడిగా రవితేజ కనిపించాడు. ఆ తర్వాత శంకర్ దాదా జిందాబాద్ లో చిన్న క్యామియో బిట్ లో మెరిశాడు. ఒకవేళ పైన రూమర్ కనుక నిజమైతే ఈ చిత్రంపై ఆసక్తి అమాంతం పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు. నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All