Homeటాప్ స్టోరీస్80s రీయూనియన్ కు బాలయ్యను పిలవట్లేదా?  లేక..

80s రీయూనియన్ కు బాలయ్యను పిలవట్లేదా?  లేక..

Why Balayya missing in 80s reunion
Why Balayya missing in 80s reunion

80s రీయూనియన్ అంటూ ఒకటి ఉందని, 80, 90ల కాలం నాటి తారలందరూ కలిసి ఏడాదికి ఒకసారి రీయూనియన్ చేసుకుని ఆ రోజంతా సరదాసరదాగా గడుపుతారు, విందు, వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతుంటారన్న విషయం తెల్సిందే. అప్పట్టి తమ అనుబంధాన్ని, ఇప్పటి పరిస్థితుల్ని సరదాగా నెమరు వేసుకుని చర్చించుకుంటారు. ఈ 80s యూనియన్ అంటూ కలిసే బ్యాచ్ లో ఒక 40 మంది దాకా ఉంటారు. ప్రతిసారీ దాదాపుగా ఒకరిద్దరు తప్పితే ఎవరూ మిస్ కారు. ప్రతి ఏడాది ఎవరో ఒక వ్యక్తి హోస్ట్ చేయడం, మిగతా వారందరూ వాళ్లింట్లోనో లేక బయటనో కలిసి హంగామా చేయడం గత కొనేళ్ళుగా నడుస్తూనే ఉంది. ఈ రీయూనియన్ లో తెలుగు నుండి దాదాపు 10 మంది స్టార్లు హాజరవుతుంటారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, జగపతి బాబు, రాజశేఖర్, నరేష్ వంటి హీరోలు తెలుగు నుండి కచ్చితంగా అటెండ్ అవుతుంటారు. ఇక్కడ మనం గమనిస్తే ఒక పేరు మిస్ అవుతుంది. అదే నందమూరి బాలకృష్ణ.80, 90ల తరంలో తెలుగు ఇండస్ట్రీకి నాలుగు దిక్కులుగా ఉంటూ వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లలో ఒక్క బాలకృష్ణ మాత్రమే ఈ వేడుకకు హాజరుకాడు. ప్రతిసారీ బాలయ్య ఎందుకు ఈ రీయూనియన్ లో మిస్ అవుతున్నాడు అన్నది అర్ధం కాని ప్రశ్నగా వారి అభిమానులకు మిగిలిపోతోంది.

చెన్నైలో ఎక్కువగా ఈ రీయూనియన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఈ రీయూనియన్ ను హోస్ట్ చేసాడు. చిరంజీవి కొత్త ఇంట్లోకి మారిన సందర్భంగా అందరికీ తన ఇంటిని కూడా చూపించినట్లు ఉంటుందన్న ఉద్దేశంతో కూడా ఈ రీయూనియన్ ను హోస్ట్ చేసాడు.

- Advertisement -

బ్లాక్ ను డ్రెస్ కోడ్ గా పెట్టాడు. ప్రతిసారి అటెండ్ అయ్యేవాళ్ళలో ఈసారి కొన్ని మెరుపులు మిస్ అయ్యాయి. రజినీకాంత్, కమల్ హాసన్ ఈ పార్టీకి అటెండ్ కాలేదు. పార్టీ హైదరాబాద్ లో కావడంతో, వాళ్లిద్దరూ షూటింగ్ లతో బిజీగా ఉండడంతో ఈ పార్టీని మిస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే రాజశేఖర్, జీవిత కూడా ఈ పార్టీకి దూరంగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు రాలేదు అన్నదానికి కారణాలు తెలీవు.

ఇకపోతే ప్రతిసారి బాలయ్య ఎందుకు మిస్ అవుతున్నాడు అన్నదానికి కూడా కారణాలు బయటకు రావట్లేదు. ఈ యూనియన్ లో బాలయ్యను కలుపుకోవట్లేదా లేక బాలయ్యే ఈ యూనియన్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడా అన్నది చూడాలి. 80, 90 ల కాలంలో బాలయ్య చాలా యాక్టివ్ హీరో. చాలా మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి ఎందుకని దూరంగా ఉంటున్నాడు అన్నది ఫ్యాన్స్ కు అర్ధం కావడం లేదు. ఇంతమందిలో బాలయ్య కూడా ఉంటే ఆ పిక్చర్ పెర్ఫెక్ట్ గా ఉంటుందన్నది ఫ్యాన్స్ అభిప్రాయం. చిరంజీవి కొత్త ఇంట్లో జరిగే ఫంక్షన్ కాబట్టి చిరంజీవి అందరూ కావాలనుకునే మనిషే. బాలయ్యను కచ్చితంగా పిలిచే ఉంటాడు. అయినా కూడా ఎందుకు బాలకృష్ణ అటెండ్ అవ్వలేదు అని తెలియాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All