Homeన్యూస్బిగ్ బాస్ 5: కెప్టెన్ గా ఎంపికైన మానస్

బిగ్ బాస్ 5: కెప్టెన్ గా ఎంపికైన మానస్

బిగ్ బాస్ 5: కెప్టెన్ గా ఎంపికైన మానస్
బిగ్ బాస్ 5: కెప్టెన్ గా ఎంపికైన మానస్

బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రస్తుతం నీ ఇల్లు బంగారం కాను కెప్టెన్సీ టాస్క్ నడుస్తోన్న విషయం తెల్సిందే. ఈ టాస్క్ లో భాగంగా హౌజ్ మేట్స్ అందరూ గోల్డ్ మైనర్స్ గా మారతారు. ఎవరి దగ్గరైతే ఎక్కువ బంగారం ఉంటుందో వాళ్ళు కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి నెక్స్ట్ స్టేజ్ కు వెళ్తారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రియాంక, సిరిలు కెప్టెన్సీ పోటీదారులు అయిన విషయం తెల్సిందే. సిరి పర్సనల్ కారణాల వల్ల టాస్క్ ఆడలేను అని చెప్పడంతో సిరి తరుపున మానస్ గేమ్ ఆడి ఆమెను కెప్టెన్సీ పోటీదారుల రేస్ లో నిలబెట్టాడు.

ఈ నేపథ్యంలో ఈరోజు కెప్టెన్సీ టాస్క్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. ముందుగా అందిన సమాచారం ప్రకారం ప్రియాంక, సిరిలతో పాటు మానస్, ఎన్నీ మాస్టర్ లు కూడా కెప్టెన్సీ పోటీదారుల రేసులో నిలిచారు. అయితే వీరిలో చివరికి మానస్ గెలుపొంది కెప్టెన్ గా నిలిచాడు. 11వ వారాల బిగ్ బాస్ ప్రయాణంలో మానస్ తొలిసారి కెప్టెన్ గా నిలిచాడు. అయితే సరైన సమయంలో కెప్టెన్సీ రావడం మానస్ కు కలిసొస్తుందని చెప్పాలి.

- Advertisement -

ప్రస్తుతం హౌజ్ లో 9 మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో కెప్టెన్సీ అంటే ఒక వారం పాటు ఇమ్మ్యూనిటి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

బిగ్ బాస్ 5: కెప్టెన్సీ టాస్క్ గెలిచేదెవరు?

బిగ్ బాస్ 5: కెప్టెన్ గా నిలిచిన పింకీ – సేవ్ అవుతుందా?

బిగ్ బాస్ 5: కేక్ తిన్న సన్నీ ఫ్యూచర్ ఏంటి?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All