Homeన్యూస్బిగ్ బాస్ 5: కేక్ తిన్న సన్నీ ఫ్యూచర్ ఏంటి?

బిగ్ బాస్ 5: కేక్ తిన్న సన్నీ ఫ్యూచర్ ఏంటి?

బిగ్ బాస్ 5: కేక్ తిన్న సన్నీ ఫ్యూచర్ ఏంటి?
బిగ్ బాస్ 5: కేక్ తిన్న సన్నీ ఫ్యూచర్ ఏంటి?

బిగ్ బాస్ 5 లో మొన్నటి నుండి సాగిన కేక్ ప్రహసనం నిన్నటి ఎపిసోడ్ తో ముగిసింది. గార్డెన్ ఏరియాలో ఒక కేక్ ను పెట్టి ఇది తినే అర్హత మీలో ఎవరికి ఉంది అని బిగ్ బాస్ అడిగారు. ప్రశ్న ఈజీ గానే అనిపించినా హౌజ్ మేట్స్ అందరూ ఆ కేక్ తింటే ఏమవుతుంది? తాము డేంజర్ జోన్ లో ఉంటామా లేక ఇమ్మ్యూనిటి ఏమైనా లభిస్తుందా అని రకరకాలుగా ఆలోచించారు. ముందు రోజు అంతా ఏవేవో ఆలోచనలు చేసి ఎన్నీ మాస్టర్ చివరికి తాను కేక్ ను తింటానని ప్రకటించుకుంది. తీరా మార్నింగ్ లేచి చూస్తే సన్నీ ఏదైతే అది అయ్యిందని ఆ కేక్ ను తినేసాడు. దీనిపై ఎన్నీ మాస్టర్ గుస్సా అయింది కూడా. సన్నీ సెల్ఫిష్ అని అదీ, ఇదీ అంటూ ఏవేవో మాట్లాడింది.

ఆ ఎపిసోడ్ ముగిసాక కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. బిగ్ బాస్ అంతా బిబి హోటల్ గా మారింది. ఈ టాస్క్ లో శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్ హౌజ్ కీపింగ్ స్టాఫ్ కాగా, రవి నోటీస్ పీరియడ్ లో ఉన్న స్టాఫ్. ఇక ఎన్నీ మాస్టర్ హోటల్ మేనేజర్. మిగిలిన వారికి వివిధ రోల్స్ ఇచ్చారు. వారి వారి పరిధుల మేరకు హౌజ్ మేట్స్ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

రవికి గేమ్ ను పాడు చేయాలన్న సీక్రెట్ టాస్క్ రాగా అతను కాజల్ డబ్బుని కొట్టేసాడు. మరి ఈరోజు ఏమవుతుందో చూడాలి.

Also Read: 
బిగ్ బాస్ 5: నామినేషన్స్ నుండి తప్పించుకున్నది ఇద్దరే ఇద్దరు

బిగ్ బాస్ 5: నామినేషన్స్ ఫైర్ మాములుగా లేదుగా!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All