Homeన్యూస్బిగ్ బాస్ 5: కెప్టెన్ గా నిలిచిన పింకీ - సేవ్ అవుతుందా?

బిగ్ బాస్ 5: కెప్టెన్ గా నిలిచిన పింకీ – సేవ్ అవుతుందా?

బిగ్ బాస్ 5: కెప్టెన్ గా నిలిచిన పింకీ - సేవ్ అవుతుందా?
బిగ్ బాస్ 5: కెప్టెన్ గా నిలిచిన పింకీ – సేవ్ అవుతుందా?

బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు పదకొండో వారానికి చేరుకుంది. ఇప్పటికే హౌజ్ నుండి 10 మంది ఎలిమినేట్ అవ్వగా మరో 9 మంది గేమ్ ఆడుతున్నారు. నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ మరోసారి ఫుల్ ఫైర్ తో ఉన్నాయి. కెప్టెన్ రవి తప్ప మిగిలిన అందరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. షణ్ముఖ్, సిరి, ప్రియాంక, మానస్, సన్నీ, కాజల్, ఎన్నీ, శ్రీరామ్ చంద్ర నామినేషన్స్ లో ఉండడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

నిజానికి గత వారం తక్కువ ఓట్లతో మానస్, కాజల్ లు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సింది. కానీ జెస్సీ అనారోగ్యం కారణంగా ఎలిమినేట్ కావడంతో వీరు సేఫ్ అయ్యారు. అప్పుడు నామినేషన్స్ లో ప్రియాంక లేదు. అయితే ఈసారి నామినేషన్స్ లో అందరూ ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ప్రస్తుతమున్న ట్రెండ్స్ ప్రకారం ప్రియాంక, ఎన్నీ, కాజల్ లకు తక్కువ ఓటింగ్స్ వస్తున్నాయి.

- Advertisement -

ఇది పక్కన పెడితే ఈరోజు కెప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ తమ వద్ద ఉన్న గోల్డ్ కాయిన్స్ ను భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో మానస్, పింకీలు చివరి దశకు చేరుకున్నారని, వారిలో పింకీ కెప్టెన్ గా నిలిచిందని వార్తలు వస్తున్నాయి. మరి కెప్టెన్సీ దక్కడంతో పింకీ ఓటింగ్ పెరుగుతుందా అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి:

బిగ్ బాస్ 5: కేక్ తిన్న సన్నీ ఫ్యూచర్ ఏంటి?

బిగ్ బాస్ 5: ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది ఎవరు?

బిగ్ బాస్ 5: ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లేనా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All