
బిగ్ బాస్ సీజన్ 4 పూర్తై ఆరు నెలలు దాటింది. అసలైతే ఈపాటికి సీజన్ 5 మొదలుకావాలి కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యమైంది. దీంతో ఈ ఏడాది బిగ్ బాస్ ఉండదని, వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ నుండి మొదలుకాబోతోందని సమాచారం.
సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 5 ను అనౌన్స్ చేస్తారు. మొదటి ప్రోమోను వదులుతారు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమవుతుంది. 105 రోజుల పాటు సాగుతుంది. బిగ్ బాస్ సీజన్ 5 కోసం ప్రాబబుల్ లిస్ట్ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. షణ్ముఖ్ జస్వంత్, వర్షిణి, టీవీ9 యాంకర్ ప్రత్యూష, టివి5 మూర్తి, కమెడియన్ ప్రవీణ్ ఇలా పలువురిని బిగ్ బాస్ లోకి ఆహ్వానించే వీలుంది.
అలాగే సీజన్ 3 తరహాలో సీజన్ 5 లో కూడా ఒక కపుల్ షో లోకి ఎంటర్ అవుతారని తెలుస్తోంది. నాగార్జున హోస్ట్ గా కొనసాగుతారు.