Homeగాసిప్స్నిక్ ఓవ‌రాక్ష‌న్‌.. ప్రియాంక షాకింగ్ రియాక్ష‌న్‌!

నిక్ ఓవ‌రాక్ష‌న్‌.. ప్రియాంక షాకింగ్ రియాక్ష‌న్‌!

నిక్ ఓవ‌రాక్ష‌న్‌.. ప్రియాంక షాకింగ్ రియాక్ష‌న్‌!
నిక్ ఓవ‌రాక్ష‌న్‌.. ప్రియాంక షాకింగ్ రియాక్ష‌న్‌!

పెళ్లికి ముందు  పెళ్లి త‌రువాత స్టార్స్ ఓవ‌రాక్ష‌న్ చేస్తున్న సంద‌ర్భాలు చూస్తున్నాం. తాజాగా అలాంటి ఓవ‌రాక్ష‌నే చేసి ప్రియాంక చేతిలో అడ్డంగా బుక్క‌య్యాడు నిక్ జోన‌స్‌. అమెరిక‌న్ పాప్ సింగ‌ర్‌.. హాలీవుడ్ యాక్ట‌ర్ నిక్ జోన‌స్‌ని ప్రియాంక చోప్రా ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్లికి ముందే స‌హ‌జీవ‌నం చేసిన ఈ జంట ప‌బ్లిక్‌గ్గానే రొమాన్స్ చేస్తూ నెటిజ‌న్స్ చేతిలో దారుణంగా ట్రోలింగ్‌కి గుర‌య్యారు.

పెళ్లి త‌రువాత మ‌రీ రెచ్చిపోయి రోమాన్స్ చేస్తూ ఫొటోల‌కి చిక్కిన విష‌యం తెలిసిందే. విచిత్ర‌మైన యాటిట్యూడ్ కార‌ణంగా నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్న ప్రియాంక, నిక్ జోడీ మ‌రోసారి వార్త‌ల్లో నిల‌చింది. ప‌బ్లిక్‌గా లిప్‌లాక్‌లు చేస్తూ నెటిజ‌న్స్‌కి ఆగ్ర‌హం తెప్పించిన ఈ జోడీ తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా `టెక్ట్స్ ఫ‌ర్ యూ` పేరుతో రూపొందుతున్న హాలీవుడ్ చిత్రంలో న‌టిస్తోంది.

- Advertisement -

ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం లండ‌న్‌లో జ‌రుగుతోంది. ఇందు కోసం నిక్‌తో క‌లిసి ప్రియాంక లండ‌న్ వెళ్లింది. అక్క‌డ షూట్ గ్యాప్‌లో ప‌బ్బుల్లో ఎంజాయ్ చేస్తోంది ఈ జంట‌. ఆ ఎంజాయ్ మ‌రీ మితిమీరి పోవ‌డం ప్రియాంక‌కు ఆగ్ర‌హాన్ని తెప్పించింది. కార్‌లో ప్రియాంక‌తో నిక్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ట‌. దీంతో ఆగ్ర‌హించిన ప్రియాంక అత‌న్ని కార్ నుంచి బ‌య‌టికి తోసేసింద‌ట‌. అనూహ్య ప‌రిణామానికి షాక్ కు గురైన నిక్ వేరే కారులో అక్క‌డి నుంచి వెళ్లిపోయిన‌ట్టు చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All