Homeన్యూస్మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టనున్న ధనుష్!!

మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టనున్న ధనుష్!!

మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టనున్న ధనుష్!!
మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టనున్న ధనుష్!!

నటుడు ధనుష్ ఎంతటి వెర్సటైల్ అన్నది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్ర అయినా కూడా అందులోకి పరకాయ ప్రవేశం చేయడం ధనుష్ కు కొట్టిన పిండి. ప్రస్తుతం సూపర్బ్ ఫామ్ లో ఉన్న ధనుష్ కేవలం కోలీవుడ్ కు పరిమితం కాకుండా వేరే భాషల్లో కూడా సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది డైరెక్ట్ తెలుగు ఎంట్రీ కూడా ఇవ్వనున్న విషయం తెల్సిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించనున్నాడు.

అయితే అంతకంటే ముందు ధనుష్ బాలీవుడ్ సినిమా చేసాడు. అయితే ఇది ధనుష్ హిందీ డెబ్యూ కాదు. కొన్నేళ్ల క్రితమే రంజానా చిత్రంతో అక్కడి వారిని మెస్మరైజ్ చేసాడు. రంజానా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమా డైరెక్ట్ చేసిన ఆనంద్ ఎల్ రాయ్ బాలీవుడ్ లో మరో సినిమా చేసాడు. అదే అత్రాంగి రే. ఇందులో కూడా ధనుష్ హీరో. సారా అలీ ఖాన్ కథానాయిక. అక్షయ్ కుమార్ ఎక్స్టెండెడ్ క్యామియో తరహా పాత్రను చేసాడు. డిసెంబర్ 24న అత్రాంగి రే డైరెక్ట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.

- Advertisement -

ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రకారం ఇదొక రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అని అర్ధమవుతోంది. పెద్దల కారణంగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు విడిపోదాం అని అనుకుంటారు. దానికి కొంత సమయం పడుతుంది. హీరోకి హీరోయిన్ పై ఫీలింగ్స్ మొదలవుతాయి. అలాగే హీరోయిన్ కూడా ఇష్టపడే క్రమంలో హీరోయిన్ ఇష్టపడే క్యారెక్టర్ తెరపైకి వస్తుంది. అక్కడి నుండి కథ ఏ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది అన్నది సినిమా.

ఇవి కూడా చదవండి:

అన్నాత్తే తెలుగు, తమిళ్ రైట్స్ ను కొనుగోలు చేసిన ధనుష్ నిర్మాత

విజయ్, ధనుష్ తెలుగు సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి?

నాలుగు ప్రాజెక్ట్స్ ను సైన్ చేసిన ధనుష్

ధనుష్ కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయల!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All