Homeన్యూస్అన్నాత్తే తెలుగు, తమిళ్ రైట్స్ ను కొనుగోలు చేసిన ధనుష్ నిర్మాత

అన్నాత్తే తెలుగు, తమిళ్ రైట్స్ ను కొనుగోలు చేసిన ధనుష్ నిర్మాత

అన్నాత్తే తెలుగు, తమిళ్ రైట్స్ ను కొనుగోలు చేసిన ధనుష్ నిర్మాత
అన్నాత్తే తెలుగు, తమిళ్ రైట్స్ ను కొనుగోలు చేసిన ధనుష్ నిర్మాత

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రీసెంట్ సినిమాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. మరీ ముఖ్యంగా తెలుగులో ఆయన మార్కెట్ డల్ అయింది. రజినీకాంత్ నటించిన కబాలి, 2.0, కాలా, పేట, దర్బార్ చిత్రాలు తెలుగు లో నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. దీంతో రజినీకాంత్ ప్రస్తుత చిత్రం అన్నాత్తేను కొనుగోలు చేయడానికి తెలుగు బయ్యర్లు కొంత ఆలోచించారు.

అన్నాత్తే దీపావళి రిలీజ్ నవంబర్ 4 అని ప్రకటించిన విషయం తెల్సిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో అన్నాత్తే తెలుగు రిలీజ్ సంగతేంటి అన్న అనుమానం మొదలైంది. అయితే ఈ కన్ఫ్యూజన్ కు తెర పడింది. అన్నాత్తే తెలుగు రైట్స్ ను ఏషియన్ సంస్థ సునీల్ నారంగ్ దక్కించుకున్నాడు. కేవలం తెలుగు రైట్స్ మాత్రమే కాదు, తమిళ్ థియేట్రికల్ రైట్స్ ను కూడా సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్ రీసెంట్ గా లవ్ స్టోరీతో సక్సెస్ అందుకున్నాడు. మరోసారి శేఖర్ కమ్ములతో తమిళ స్టార్ హీరో ధనుష్ తో ప్యాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెల్సిందే. అన్నాత్తే చిత్రాన్ని శివ డైరెక్ట్ చేయగా కీర్తి సురేష్, నయనతార హీరోయిన్లుగా నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్నాత్తే ఫస్ట్ సాంగ్ ఇటీవలే విడుదలై చార్ట్ బస్టర్ అయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All