
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసాడు. లవ్ స్టోరీ సాంగ్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సారంగ దరియా, ఏ పిల్లా, నీ చిత్రం చూసి పాటలు టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే వారం ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా దీనికి రెస్పాన్స్ భారీగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఫ్యామిలీ ప్రేక్షకులు పూర్తి స్థాయిలో థియేటర్ కు వచ్చింది లేదు. లవ్ స్టోరీ మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించగలదని భావిస్తున్నారు.
డొమెస్టిక్ సర్క్యూట్ లోనే కాక ఓవర్సీస్ లో కూడా లవ్ స్టోరీ చిత్రం జోరు చూపిస్తోంది. 187 లొకేషన్స్ నుండి ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ తోటే $150K క్రాస్ చేసింది. ఇక ప్రిమియర్స్ + డే 1 నెంబర్స్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయ్. జాతిరత్నాలు తర్వాత యూఎస్ లో సూపర్ హిట్ అవ్వదగ్గ సినిమాగా లవ్ స్టోరీ అనిపిస్తోంది.