Homeటాప్ స్టోరీస్'అఖండ'తో శ్రీకాంత్ కు కొత్త లైఫ్ వస్తుందా?

‘అఖండ’తో శ్రీకాంత్ కు కొత్త లైఫ్ వస్తుందా?

'అఖండ'తో శ్రీకాంత్ కు కొత్త లైఫ్ వస్తుందా?
‘అఖండ’తో శ్రీకాంత్ కు కొత్త లైఫ్ వస్తుందా?

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్ర ట్రైలర్ ను నిన్న సాయంత్రం విడుదల చేసారు. అందరి ఊహలకు తగ్గ రీతిలోనే ట్రైలర్ అంతటా భారీ డైలాగ్స్, మాస్ ఫైట్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. బాలకృష్ణ రెండు భిన్నమైన గెటప్స్ కూడా అదిరిపోయాయి. ఇక ట్రైలర్ లో శ్రీకాంత్ పాత్ర కూడా హైలైట్ అయింది. రఫ్ అండ్ టఫ్ విలన్ గా శ్రీకాంత్ ఆకట్టుకుంటున్నాడు. ఇక ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ కూడా అదిరింది.

బోయపాటి సినిమాలో హీరోతో పాటు విలన్లు కూడా హైలైట్ అవుతారు. లెజండ్ చిత్రం ద్వారా జగపతి బాబుకు విలన్ గా కొత్త కెరీర్ ను ఏర్పాటు చేసాడు బోయపాటి. అలాగే సరైనోడులో విలన్ గా ఆదికి చాలా మంచి పేరొచ్చింది. అలాగే శ్రీకాంత్ కూడా అఖండ ద్వారా తాను విలన్ గా బిజీ కావాలని కోరుకుంటున్నాడు. నిజానికి శ్రీకాంత్ కు ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ వేషాలు వేసినా తర్వాత ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకున్నాడు శ్రీకాంత్. సరైనోడులో కూడా పాజిటివ్ రోల్ చేసిన విషయం తెల్సిందే.

- Advertisement -

మరి అఖండతో తన కెరీర్ టర్న్ అవుతుందా? ఏమో డిసెంబర్ 2 వరకూ వేచి చూడక తప్పదు.

ఇవి కూడా చదవండి:

గని ప్రపంచంలో ఉన్నది వీరే!

అఖండ రిలీజ్ డేట్ లాక్ అయినట్లేనా?

రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న గుడ్ లక్ సఖి

అది తప్ప గని ఫుల్ సెట్!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All