Homeగాసిప్స్అఖండ రిలీజ్ డేట్ లాక్ అయినట్లేనా?

అఖండ రిలీజ్ డేట్ లాక్ అయినట్లేనా?

అఖండ రిలీజ్ డేట్ లాక్ అయినట్లేనా?
అఖండ రిలీజ్ డేట్ లాక్ అయినట్లేనా?

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కు కాంబినేషన్ క్రేజ్ ఉంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో అఖండ విషయంలో ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. అఖండ షూటింగ్ రీసెంట్ గా పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

అఖండ రిలీజ్ విషయంలో గత కొన్ని రోజులుగా నెలకొని ఉన్న కన్ఫ్యూజన్ కు ఎట్టకేలకు తెరపడినట్లు సమాచారం. డిసెంబర్ 2న విడుదలకు అఖండ సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 3న వరుణ్ తేజ్ గని విడుదలవ్వాల్సింది కానీ అది వారం రోజులు వెనక్కి జరుగుతోంది. డిసెంబర్ 9న గని విడుదలవుతుందని తెలుస్తోంది.

- Advertisement -

అఖండ టైటిల్ సాంగ్ ను ఇటీవలే విడుదల చేయగా దానికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సూపర్ ఫామ్ లో ఉన్న ఎస్ ఎస్ థమన్ అఖండ చిత్రానికి కూడా పూర్తి న్యాయం చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా శ్రీకాంత్ మెయిన్ విలన్ గా కనిపిస్తాడు. మిర్యాల రవీందర్ రెడ్డి అఖండను భారీ లెవెల్లో నిర్మించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All