Homeగాసిప్స్అఖండ రిలీజ్ పై ఓ నిర్ణయం తీసుకున్న బోయపాటి శ్రీను

అఖండ రిలీజ్ పై ఓ నిర్ణయం తీసుకున్న బోయపాటి శ్రీను

అఖండ రిలీజ్ పై ఓ నిర్ణయం తీసుకున్న బోయపాటి శ్రీను
అఖండ రిలీజ్ పై ఓ నిర్ణయం తీసుకున్న బోయపాటి శ్రీను

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను, టాప్ హీరో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గా బాలకృష్ణ పాల్గొన్న భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసారు. ఈ క్లైమాక్స్ పార్ట్ ను దాదాపు 15 రోజుల పాటు తమిళనాడులోని టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ లో షూటింగ్ చేసారు. ప్రస్తుతం కొంత టాకీ పార్ట్ మిగిలుంది. అలాగే రెండు పాటలను షూట్ చేసింది.

త్వరలోనే షూటింగ్ మొత్తం పూర్తయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ పై బోయపాటి శ్రీను ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 8న అఖండ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు భావిస్తున్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13కి విడుదల అని చెప్తున్నా వచ్చే సంవత్సరానికి వాయిదా పడుతుందని అంటున్నారు. ఒకవేళ వాయిదా పడితే అక్టోబర్ 8 రిలీజ్ డేట్ ను అఖండకు లాక్ చేస్తారు. లేదంటే మరో రిలీజ్ డేట్ ను చూస్తారు.

- Advertisement -

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. ఎస్ ఎస్ థమన్ స్వరాలు అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All